7 August, 2026 | 7:50 AM

ముగ్గురు నకిలీ గల్ఫ్ ఏజెంట్ల అరెస్ట్

27-05-2024 12:05 AM

రాజన్న సిరిసిల్ల, మే 26 (విజయక్రాం తి): ఎలాంటి అనుమతులు లేకుండా మోసాలకు పాల్పడుతున్న నకిలీ గల్ఫ్ ఏజెంట్ ఆఫీసులపై ఆదివారం సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధర్యంలో పోలీ స్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. నకిలీ ఏజెంట్లయిన తంగళ్లపల్లి మండలం సారంపల్లికి చెందిన మహమ్మద్ మహబూబ్,  రుద్రంగి మం డలం కేంద్రానికి చెందిన బొండు అంజ య్య, గంభీరావుపేట్ మండలం నర్మలకు చెందిన ఓరగంటి రాములును అదుపులోకి తీసుకుని, వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్  ఓ ప్రకటన విడుదల చేశారు. నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 19 మంది నకిలీ ఏజెంట్లపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు.