సమస్యల వలయంలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): ప్రభుత్వాలు మారినా వారి తలరాతలు మారడం లేదు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేసినా సరైన గుర్తింపు లభించడం లేదు. వారే రాష్టంలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పనిచేస్తు న్న ఔట్‌సోర్సింగ్ కార్మికులు. చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తూ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో సుమారు 65 వేల మంది, 12,769 గ్రామ పంచాయతీల్లో 52 వేల మంది కార్మికులు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, ఎన్‌ఎంఆర్ ఫిక్స్‌డ్ పే తదితర విభాగాల్లో పనిచేస్తున్నారు. ఏళ్లుగా విధులు నిర్వహిస్తు న్నా వారిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఉద్యోగ భద్రత, బీమా వంటి వాటికి నోచుకోవడం లేదు. విధుల నిర్వహణలో పలువురు ప్రాణాలు కోల్పోయినా సందర్భా లు కూడా ఉన్నాయి.
తమ సమస్యలు పరిష్కరించాలని 34 రోజుల పాటు సమ్మె చేస్తే రూ.5 లక్షల బీమా, చనిపోతే దహన సంస్కారాల కోసం రూ.10,000 ఇస్తామని సర్క్యు లర్ జారీ చేసిన గత ప్రభుత్వం, గైడ్‌లైన్స్‌ను మాత్రం రూపొందించలేదు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్లు ఏర్పాటు, చెత్తడంపింగ్, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు తదితర పనుల్లో ఔట్‌సోర్సింగ్ కార్మికులు సేవలు అందిస్తున్నారు. తమను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్లు, గుమాస్తాలు, సహా య కార్యదర్శులు(స్పెషల్ స్టేటస్)గా గుర్తించాలని కార్మికులు కోరుతున్నారు.






