రేకుల షేడ్డు కూలి నలుగురు మృతి
26-05-2024 07:34 PM
నాగర్
కర్నూల్ : జిల్లా కేంద్రంలో ఆదివారం
సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న రేకుల షేడ్డు కూలి నలుగురు మృతి
చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామ శివారు అయ్యప్ప టెంపుల్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు
తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ సాయంత్రం వీచిన భారీ ఈదురుగాలులకు నిర్మాణంలో ఉన్న రేకుల
షెడ్డు కులిపోయింది. ఈ ప్రమాదంలో యాజమని మల్లేష్, పదేళ్ల చిన్నారితో పాటు ఇద్దరు
కూలీలు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వారిని నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు
చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది






