26-07-2025 12:43:36 AM
మహబూబాబాద్, జూలై 25 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ముగ్గు రికి ఏఎస్త్స్ర లుగా పదోన్నతి లభించింది. కేసముద్రం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్. సదయ్య, మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న జీ.కృష్ణ నాయక్, స్పెషల్ బ్రాంచ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న టి. కుమారస్వామి లకు ఏఎస్‌ఐలుగా పదోన్నతి లభించింది. పదోన్నతి లభించిన ఏఎస్‌ఐ లను జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అభినందించారు. వృత్తినిబద్ధతతో పనిచేసి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురా వాలని ఆకాంక్షించారు.