04-07-2025 12:00:00 AM
సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ఎత్తుకెళ్లిన అల్‌ఖైదా ఉగ్రవాదులు
మాలి, జూలై 3: మాలిలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్‌కు గురవ్వడం కలకలం రేపింది. మాలిలోని ఒకఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ముగ్గురు భారతీయ కార్మికులను అల్ సంబంధం ఉన్న ఉగ్రవాదులు అపహరించుకుపోయారు. ఈ విషయాన్ని గురువారం విదేశాంగశాఖ అధికారులు ధ్రువీకరించారు. పశ్చిమాఫ్రికా దేశమైన మాలిలో ఇటీవల అనేక ప్రాంతాల్లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. భారత పౌరుల అపహరణపై విదేశాంగశాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
వారిని విడుదల చేసేందుకు కృషి చేయాలని మాలి ప్రభుత్వాన్ని కోరింది. దుండగులు తుపాకులతో వచ్చినట్టు స్థానిక నివేదికలు పేర్కొంటున్నాయి. అల్ ఖైదా గ్రూప్ అయిన జమాత్ నుస్రత్ అల్‌న వల్‌క్షి (జేఎన్‌ఐఎం) మాలి వ్యాప్తంగా దాడులు చేస్తోంది. ఈ ముగ్గురి అపహరణ వెనుక కూడా ఈ గ్రూప్ హస్తమే ఉన్నట్టు అనుమానిస్తున్నారు. భారత విదేశాంగశాఖ వీరి అపహరణను తీవ్రంగా ఖండించింది. అపహరణకు గురైన భారతీయులను రక్షించాలని మాలి అధికారులను కోరింది.