08-11-2025 09:29:34 AM
అమరావతి: కాకినాడ(Kakinada) జిల్లాలో కారు బీభత్సం(Car Accident) సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి కిర్లంపూడి మండలం(Kirlampudi Mandal) సోమ వరం వద్ద హైవేపై ఆరుగురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు విద్యార్థినులు సహా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు షెల్టర్ లో వేచి ఉండగా కారు ఆరుగురికిపై దూసుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. కారు ఫ్రంట్ టైరు పేలడంతో అదుపుతప్పి విద్యార్థుల పైకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని జ్యోతుల నెహ్రూ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.