calender_icon.png 8 November, 2025 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్థరాత్రి ఎర్రగడ్డలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేత ఇంట్లో సోదాలు

08-11-2025 09:12:20 AM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్(Erragadda Division) శుక్రవారం రాత్రి ప్రేమ్ నగర్ కాలనీలో కాంగ్రెస్ నేత సాలం షౌజ్(Congress leader Salam Shouj) ఇంట్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు(Flying squad inspection) నిర్వహించింది. సాలం షౌజ్ ఇంట్లో భారీగా నగదు ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. రూ. 6 కోట్ల నగదున్నట్లు ఎన్నికల అధికారులకు బీఆర్ఎస్ సమాచారం ఇచ్చింది. సమాచారంతో మేజిస్ట్రేట్ స్థాయి అధికారితో భారీ పోలీసు బందోబస్తు నడుమ కాంగ్రెస్ నేత ఇంట్లో ఎన్నికల అధికారులు సోదాలు జరిపారు. సాలం ఇంట్లో లైట్లు బంద్ చేసి ఏం సోదాలు చేస్తున్నారు. మీడియాని ఎందుకు లోపలికి రానివ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(BRS MLA Palla Rajeshwar Reddy) అధికారులను ప్రశ్నించారు. సోదాలు జరుగుతున్న ఘటన స్థలానికి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు  చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొందినగదు దొరకకపోవడంతో ఎన్నికల సిబ్బంది సాలం సౌజ్ ఇంటి నుంచి వెనుదిరిగారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి నవంబర్ 11న జరగనున్న ఉప ఎన్నికకు ముందు భారత ఎన్నికల సంఘం (Election Commission of India) ఫ్లయింగ్ స్క్వాడ్‌లు కొంతమంది బీఆర్ఎస్ నాయకుల ఇళ్లల్లో శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఓటర్లకు పంపిణీ చేయడానికి ఉద్దేశించిన నగదును వారి ప్రాంగణంలో ఉంచారనే ఫిర్యాదుల మేరకు ఎన్నికల అధికారులు, కేంద్ర పోలీసు బృందాల సహాయంతో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ టి. రవీందర్ రావు ఇళ్లను సోదా చేశారు. మోతీ నగర్‌లోని జనార్ధన్ రెడ్డి ఇంట్లో, రహమత్ నగర్‌లోని రవీందర్ రావు ఇంట్లో సోదాలు జరిగాయి. భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) తన నాయకుల ఇళ్లలో జరిగిన సోదాలను ఖండించింది. అధికార కాంగ్రెస్ పార్టీని నిందించింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో లేని ప్రాంతాల్లో పోలీసుల సోదాలను బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు.