calender_icon.png 8 November, 2025 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రౌడీషీటర్ సూరిని అరెస్ట్ చేసిన పోలీసులు

08-11-2025 09:44:26 AM

హనుమకొండ,(విజయక్రాంతి): గత కొంత కాలంలో హనుమకొండలో సంచరిస్తున్న రౌడీషీటర్ సూరి(Police arrest rowdy sheeter Suri) అలియాస్ దాసరి సురేందర్ అతని గ్యాంగ్ ను హన్మకొండ కమిషనరేట్ పరిధిలోని శాయంపేట ఎస్సై జే. పరమేశ్వర ఆధ్వర్యంలో గూడెపాడు క్రాస్ వద్ద అరెస్టు చేశారు. హనుమకొండ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం...హన్మకొండ జిల్లా పరిధిలో బెదిరిం పులకు పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

హైదరాబాద్ లో పలు కేసుల్లో నిందితుడైన రౌడీ షీటర్ సూరి అలియాస్ దాసరి సురేందర్ ను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసులు సిటీ బహి ష్కరణ చేయగా ఆరు నెలలుగా హనుమకొండ పరిధిలో నివాసం ఏర్పరచుకొని కొంతమంది విద్యార్థులను తన గ్యాంగ్ లో చేర్చుకొని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఆయనపై హైదరాబాద్ లోని మీర్ పేటతో పాటు పలు పోలీస్టేషన్ల పరిధిలో 45 క్రిమినల్ కేసులు, మూడు పీడీ యాక్ట్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. హత్య, అత్యాచారం, దోపిడీదొంగతనాలు పలు కేసుల్లో సురేందర్ నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. హనుమకొండ ప్రాంతానికి చెందిన శివమణి, తరుణ్, ప్రదీప్, సాయి, రవితేజ, సాయిశివ, చక్రి లతో పరిచయం పెంచుకొని ఆరు నెలలుగా భీమారం ప్రాంతంలో ఉంటూ పలు బెదిరింపు లకు పాల్పడుతున్నారని తెలిపారు. భూపాలపల్లికి చెందిన బాసిత్ అనే వ్యక్తి హత్యకు గురికాగా ఆ కేసులో ఉన్నవారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నాలు

చేసినట్లు తెలిపారు. శాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాందారి పేట వద్ద మద్యం సేవించ డంతో పాటు లారీ డ్రైవర్ ను పిస్టల్ తో బెదిరించి డబ్బులు తీసుకుని పారిపోయిన కేసుల్లో, అదే ఏరియాలో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకుని, డబ్బులు చెల్లించకుండా, బంకు యజమానిని బెదిరించిన కేసులో నిందితులని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సురేందర్, చక్రి, రాహుల్, శివమణి, శివవైభవ్, నితిన్, క్రాంతిని అరెస్టు చేసినట్లు తెలిపారు. శాయంపేట ఎస్సె జక్కుల పరమేశ్వర్ ఆధ్వర్యంలో అరెస్టులు జరిగాయని తెలిపారు. ఈ మేరకు వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుల దగ్గర నుండి రెండు పిస్తోళ్లు, ఒక బుల్లెట్టు, ఏడు మొబైల్ ఫోన్లు, రెండు మోటార్ సైకిల్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.