calender_icon.png 13 May, 2025 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షోపియన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

13-05-2025 04:33:16 PM

శ్రీనగర్,(విజయక్రాంతి): ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూ కాశ్మీర్‌లోని దక్షిణ షోపియన్ జిల్లాలోని అడవుల్లో మంగళవారం భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు అనుమానిత లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) కార్యకర్తలు మరణించారు. మంగళవారం తెల్లవారుజామున నిఘా వర్గాల సమాచారంతో తొలుత షోపియన్‌లోని కుల్గాంలో భద్రత దళాలు గాలింపు చర్యలు చేపట్టింది. కెల్లర్ ప్రాంతంలోని షుక్రూ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు తారసపడి నిరోధక ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ (SOG) సంయుక్త బృందం కదిలిన తర్వాత ఎదురుకాల్పులు జరిగాయని ఆ వర్గాలు తెలిపాయి. 

అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే నిర్దిష్ట సమాచారం ఆధారంగా కార్డన్-అండ్-సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించబడిందని, త్వరలోనే ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పడ్డాయని, వారిలో ముగ్గురు తటస్థీకరించబడ్డారని తెలిసింది. కాల్పుల సమయంలో సమీప అటవీ ప్రాంతానికి ముష్కరులు పారిపోయనట్లు అధికారులు వెల్లడించారు. సుమారుగా రెండు గంటలు వెంబడించి ముగ్గురు ఉగ్రవాదుల హతమార్చినట్లు ధృవీకరించారు. మరో ఉగ్రవాది ఉండొచ్చనే అనుమానంతో గాలిస్తున్నట్లు భద్రతా దళాలు పేర్కొన్నాయి.