13-05-2025 05:27:10 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ అతిథ్యం వహిస్తోంది. వివిధ దేశాల నుంచి తరలివచ్చిన సుందరీమణులు మంగళవారం రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో సందర్శించారు. కాసేపట్లో మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్ లోని చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లో సందర్భించనున్న నేపథ్యంలో అక్కడ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహానదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు. చార్మినార్ నుంచి చౌమహాల్లా ప్యాలెస్ వరకు సుందరీమణులు హెరిటేజ్ వాక్ నిర్వహించి లాడ్ బజార్ దుకాణాల్లో షాపింగ్ చేయనున్నారు. పోలీసు యంత్రాంగం ఇప్పటికే చార్మినార్ వద్ద 3 వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది.