calender_icon.png 12 August, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

S-400 వ్యవస్థ ముందు ప్రధాని మోదీ సెల్యూట్

13-05-2025 04:05:25 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): దేశంలోనే రెండో అతిపెద్ద వైమానిక స్థావరాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సందర్శించారు. పంజాబ్ లోని అధంపూర్ వైమానిక స్థావరంలో ఆపరేషన్ సందూర్ లో పాల్గొన్న వాయుసేన సిబ్బందితో ప్రధాని భుజం తట్టి ముచ్చటించారు. అదంపూర్ వైమానిక స్థావరంలో గంటన్నరకు పైగా గడిపిన మోదీతో ఆపరేషన్ సింధూర్ సంబంధించిన వివరాలను వాయుసేన సిబ్బంది పంచుకున్నారు.  అందపూర్ వైమానిక స్థావరంపై దాడి చేసినట్లు పాకిస్థాన్ దుష్ప్రచారం చేసిందని, పాక్ తప్పుడు ప్రచారాన్ని ప్రధాని తిప్పికొట్టారు. ఎస్ 400 క్షిపణి రక్షణ వ్యవస్థ ముందు నిలబడి సెల్యూట్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్ 400ను ధ్వంసం చేశామన్న పాకిస్థాన్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఎయిర్ బేస్ కు వెళ్లిన ప్రధాని మోదీ పాకిస్థాన్ కు ఇండియా ఎయిర్ ఫోర్స్ సత్తా చూపారని ప్రశంసించారు.