calender_icon.png 4 August, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్

03-08-2025 12:22:07 AM

కుల్గాంలో ‘ఆపరేషన్ అఖాల్’ 

కుల్గాం, ఆగస్టు 2: జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ‘ఆపరేషన్ అఖాల్’లో భా గంగా ముగ్గురు టీఆర్‌ఎఫ్ ఉగ్రవాదులు హ తమయ్యారు. ఆర్మీ, కశ్మీర్ పోలీసులు, భద్ర తా బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. శుక్రవారం దక్షిణ కశ్మీర్ జిల్లా అఖాల్‌లోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు నిఘా వర్గాలకు సమా చారం అందింది. దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.

ఈ క్రమంలో ఉగ్రవాదులు దళాలపై కాల్పులు జరపడం ప్రారంభించారు. వీటికి ప్రతిస్పందనగా భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగారు. మొదట ఒక ఉగ్రవాది మృతి చెందగా.. ఆ తర్వాత మరో ఇద్దరు ముష్కరులు హతమయ్యారని అధికారులు తెలిపారు. ముష్కరుల వేట కోసం ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు.