calender_icon.png 4 August, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్

03-08-2025 12:29:29 AM

  1. ఎన్నికల దుర్వినియోగానికి సంబంధించి ఆధారాలున్నాయి
  2. త్వరలోనే అన్ని విషయాలు ప్రజలు ముందు నిరూపిస్తాం
  1. మా ఆధారాలతో ఈసీ పునాదులు కదలబోతున్నాయి
  2. మరో 15 సీట్లు రాకపోయుంటే మోదీ ప్రధాని అయ్యేవారు కాదు
  3. కాంగ్రెస్ వార్షిక లీగల్ కాన్‌క్లేవ్ 2025లో రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ, ఆగస్టు 2: గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, ఎన్నికల దుర్వినియోగానికి సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ ఎలా జరిగిందనే విషయాన్ని త్వరలోనే ప్రజల ముందు పెట్టి నిరూపిస్తామన్నారు. తాము బయటపెట్టే ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పునాదులు కదలిపోతాయని పేర్కొన్నారు.

గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చాలా తక్కువ మెజారిటీతో మూడోసారి ప్రధానిగా గెలుపొందారన్నా రు. ఆ ఎన్నికల్లో మరో 15 సీట్లు రాకపోయుంటే మోదీ ప్రధాని కాకపోయేవారని పేర్కొన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన లీగల్ కాన్‌క్లేవ్‌కు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘లోక్‌సభ ఎన్నికల్లో అవకతవకలపై తాము దర్యాప్తు చేస్తున్న సమయంలో ఒక నియోజకవర్గ ఓటరు జాబితాలో 6.5 లక్షల మంది ఓటర్లలో 1.5 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉ న్నట్టు తేలింది.

లోక్‌సభ ఎన్నికల్లోనూ రిగ్గిం గ్ జరిగింది. దీనికి సంబంధించి అన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయి. త్వరలోనే అన్ని ఆధారాలు ప్రజల ముందు పెడతాం. 2014 నుంచి ఏదో తప్పు జరుగుతున్నట్టు తనకు అనిపిస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పైనా అనుమానాలు ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లోనూ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇదంతా చూస్తుంటే గత పదేళ్లుగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతున్నట్టుగా ఉంది. మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిచాం.. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నాలుగు నెలల గ్యాప్‌లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య కొత్తగా కోటి మంది ఓటర్లు ఉన్నట్టు కనుగొన్నాం. అయితే ఈ ఓట్లలో ఎక్కువ భాగం బీజేపీకే వెళ్లాయి. బీజేపీకి ప్రయోజనం చేకూర్చడానికి ఎన్నికల సంఘం ఓట్ల దొంగతనంలో పాలుపంచుకుంది.

ఓట్ల కుంభకోణంలో పాల్గొన్న ఎన్నికల కమిషన్ అధికారులు పదవీ విరమణ చేసినా కూడా వారిని వదిలిపెట్టం.’ అని రాహుల్ వెల్లడించారు. అనంతరం దివంగత నేత, మాజీ మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలను రాహుల్ గుర్తుచేసుకున్నారు. ‘మేము వ్యవసాయ చట్టాల కోసం పోరాడుతుంటే అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ నన్ను కలిశారు. మీరు ఇలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తే మిమ్మల్ని జైలులో పెట్టాల్సి వస్తుందన్నారు. అయితే ఇప్పుడు ఆయన మన మధ్యన లేనప్పటికీ.. ఆనాడు మీరు ఎంత బెదిరించినా మా పోరాటం ఆగదని తేల్చి చెప్పాం’ అని రాహుల్ తెలిపారు.

నా తండ్రికి ఆ అలవాటు లేదు:  రోహన్ జైట్లీ

దివంగత నేత అరుణ్ జైట్లీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆయన కుమారుడు రోహన్ జైట్లీ ఖండించారు. విపక్షాలను బెదిరించడం తన తండ్రికి అలవాటు లేదని, ఆయన ఎప్పుడూ బహిరంగ చర్చలకే ప్రాధాన్యమిచ్చేవారని తెలిపారు. తన తండ్రి 2019లో కన్నుమూశారని.. వ్యవసాయ చట్టాలు 2020లో ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. గతంలో మనోహర్ పారికర్  విషయంలోనే రాహుల్ ఇలానే మాట్లాడారని తెలిపారు.

పారికర్ చివరి రోజులను రాజకీయం చేస్తూ రాహుల్ మాట్లాడటం ఉత్తమ అభిరుచి అనిపించుకోదన్నారు. దివంగత నేతల ఆత్మశాంతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ కూడా మండిపడ్డారు. అరుణ్ జైట్లీ రాహుల్‌ను కలవడం అసత్యమని, ఇది తప్పుదారి పట్టించడమే అవుతుందని తెలిపారు.

ఎమర్జెన్సీ పాపాలను ఇప్పటికీ మోస్తుంది: రాజ్‌నాథ్ 

కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రక్షణమంత్రి రా జ్‌నాథ్ సింగ్ స్పందించారు. ‘కాంగ్రెస్ నేత రాహుల్.. కేంద్ర ఎన్నికల సంఘం ఓట్లను దొంగలిస్తుందని అంటున్నారు. కానీ ఈసీ ఒక రాజ్యాంగ సంస్థ. అది తన సొంత విశ్వసనీయతను కలిగి ఉంటుంది. అటువంటి రాజ్యాంగ సంస్థపై ప్రతిపక్ష హోదాలో ఉన్న రాహుల్  ని రాధార ఆరోపణలు చేయడం సరికాదు.

1975లో ఎమర్జెన్సీ సమ యంలో రాజ్యాంగాన్ని హత్యచేసిన మరకను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మోస్తోంది. తనవద్ద పదే పదే అణుబాంబు లాంటి ఆధారాలున్నాయ ని రాహుల్ అంటున్నారు.. ఆ అణుబాంబును పేల్చనివ్వండి. అయితే అది పేలేటప్పుడు ఆయనకు హానీ కలగకుండా చూసుకోవాలి. గతం లో భూకంపం అంటూ హెచ్చరిక లు చేశారు. కానీ అది తుస్సుమం ది’ అని రాజ్‌నాథ్ మండిపడ్డారు.