03-08-2025 12:19:46 AM
బీహార్ ఓటర్ల ముసాయిదా జాబితాపై తేజస్వీ యాదవ్ ఆరోపణలు
పాట్నా, ఆగస్టు 2: బీహార్ శాసనసభ ఎన్నికల ఓటర్ల ముసాయిదా జాబితా మాటల మంటలు రేపుతోంది. ఈసీ శుక్రవారం జాబితాను ప్రచురించగా... జాబితాలో తనపేరు గల్లంతైందనిఆర్జేడీ నేత, బీహార్ మా జీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యా ద వ్ ఆరోపించారు. ఆయన అందరి ఎ దుటే తన ఎపిక్ (ఈపీఐసీ) నంబర్ తో శోధించి చూడగా ఎ టువంటి వి వరాలు కనిపించలేదు.
‘ నా ఈపీఐ సీ నంబరుతో ఎన్నికల సంఘం వె బ్‌సైట్‌లో చెక్ చేశా.. ఈ ముసాయి దా జాబితాలో నా పేరు కనిపించలే దు. నేను ఎన్నికల్లో ఎలా పోటీ చే యాలి? స్వయంగా బూత్ లెవల్ అ ధికారి నా వద్దకు వచ్చి ఫామ్ తీ సుకెళ్లారు. అయినా జాబితాలో నా పే రు లేదు’ అని తేజస్వీ యాదవ్ మ ండిపడ్డారు.
ఖండించిన ఎన్నికల సంఘం
తేజస్వీ యాదవ్ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించిం ది. ఓటర్ల ముసాయిదా జాబితాలో ఆయన పేరు ఉన్నట్టు ఓ జాబితాను విడుదల చేసింది. ముసాయిదా జా బితాలో సీరియల్ నంబర్ 416గా తేజస్వి పేరు ఉంది.
తన పేరు లేదం టూ తేజస్వీ యాదవ్ చేసిన ఆరోపణలు అబద్దం అని ఈసీ తెలిపింది. ‘ఎస్‌ఐఆర్ తర్వాత ప్రకటించిన ము సాయిదా ఓటర్ల జాబితాలో ఏవైనా అభ్యంతరాలుం టే తెలిపేందుకు సె ప్టెంబర్ 1 దాకా సమయం ఉంది’ అని ఈసీ ప్రకటించింది.