calender_icon.png 15 September, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి

15-09-2025 09:41:35 AM

రాంచీ: జార్ఖండ్‌లోని హజారీబాగ్(Jharkhand encounter) జిల్లాలో సోమవారం ఉదయం కోబ్రా బెటాలియన్, గిరిదిహ్, హజారీబాగ్ పోలీసుల సంయుక్త బృందంతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ ఉన్నట్లు పేర్కొన్నారు. సహదేవ్ (Sahadev Soren)పై రూ. కోటి రివార్డు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో జోనల్ కమిటీ సభ్యుడు జహల్, మావోయిస్టు చంచల్ ఉన్నారు. మావోయిస్టులు చంచల్, జవాల్ పై రూ. 50 లక్షలు చొప్పున రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గోర్హార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంటిత్రి అడవిలో ఉదయం 6 గంటల ప్రాంతంలో నిషేధిత సిపిఐ (మావోయిస్ట్)కి చెందిన సహ్‌దేవ్ సోరెన్ స్క్వాడ్, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ప్రస్తుతం మావోయిస్టుల మృతదేహాలతో పాటు, ఆయుదాలు స్వాధీనం చేసుకున్నామని భద్రతా దళాలు తెలిపాయి. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.