calender_icon.png 12 June, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్

10-06-2025 08:39:00 PM

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి(Nalgonda Government Hospital)లో మంగళవారం పట్టపగలే మూడు సంవత్సరాల బాలుడు కిడ్నాప్ కలకలం రేపింది. ఆసుపత్రిలో ఆడుకుంటున్న ఆ బాలుడిని ఒక వృద్ధురాలు ఆటోలో ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ కే శివరాంరెడ్డి(DSP K Sivaram Reddy) రంగంలోకి దిగి తమ ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో రైల్వేస్టేషన్, బస్టాండ్, హోటల్స్, లాడ్జింగ్ ముఖ్య కూడలల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.