26 June, 2026 | 6:15 PM

Breaking News

ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •   బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి పునః ప్రతిష్ట   •   వర్షాలు కురవాలని మడేలేశ్వర స్వామికి జలాభిషేకం   •   హీరా గోల్డ్ ఆస్తులు వేలం వేసిన ఈడీ   •  

నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో ముగ్గురు యువకుల గల్లంతు

02-06-2025 10:53 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) నిజాంసాగర్ మండలంలోని పిప్పిరియల్ తాండ సమీపంలో గల నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో సోమవారం సాయంత్రం ముగ్గురు యువకులు స్థానికులు తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమరిపేట గ్రామానికి చెందిన బెస్ట్ హర్షవర్ధన్(17) ఇంటర్మీడియట్ విద్యార్థి, ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన నవీన్ (25), ఎల్లారెడ్డికి చెందిన మధుకర్ గౌడ్(24) మన ముగ్గురు యువకులు కలిసి స్నానికి వెళ్లి గల్లంతు అయినట్లు తెలుస్తుంది.

సెలవులు కావడంతో విహారానికి స్నానాలు చేస్తుండగా ఒకరిని చూసి మరొకరు రక్షించేందుకు వెళ్లి గల్లంతయినట్లు స్థానికులు చెప్తున్నారు. వారి గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ముగ్గురు యువకుల కుటుంబ సభ్యులు తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చెందుతున్నారు. ముగ్గురు యువకు నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో గల్లంతు సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ముగ్గురు యువకుల కుటుంబాల వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిజాంసాగర్ పోలీసులతో పాటు ఎల్లారెడ్డి పోలీసులు గాలింపు చర్యలలో  పాల్గొన్నారు.