విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ
నల్గొండ డిఎంహెచ్వో పుట్ట శ్రీనివాస్
మునుగోడు (విజయక్రాంతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని నల్గొండ డిఎంహెచ్ఓ పుట్ట శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి రివ్యూ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అన్నారు. తమ దృష్టిలో పరిష్కారం కానీ విషయాలను మా దృష్టికి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలకు అందుతున్న సదుపాయాలు, కిచెన్, ఆహార నాణ్యతను పరిషిలించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కేస రవి, మర్రిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇన్చార్జ్ డాక్టర్ షాలిని, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.






