calender_icon.png 7 February, 2026 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పులి జాడలు.. జనం హడలు!

07-02-2026 12:16:46 AM

  1. ఆలేరు నియోజకవర్గ ప్రజలు భయభ్రాంతులు

పట్టుకునేందుకు గట్టి నిఘా పెట్టిన అధికారులు

పొలాలకు వెళ్లాలంటే జంకుతున్న రైతులు

పులి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టిన అధికారులు 

బంధించి ఆందోళన తొలగించాలంటున్న స్థానికులు

ఆలేరు, ఫిబ్రవరి 6 : ఆలేరు నియోజకవర్గంలోని ప్రజలను రోజుకు ఒకచోట పులి జాడలు హడలెత్తిస్తున్నాయి. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కనిపించడంతో ఎప్పుడు ఏ గ్రామంలో దాడి చేస్తుందోననే భయం ఆయా మండలాల ప్రజలలో నెలకుంది. రోజుకు ఒకచోట దాడి చేసి పశువులను చంపి వెళ్ళిపోతుండటంతో రోజురోజుకు వారిలో భయం మరింత పెరుగుతుంది. పెద్దపులిని అధికారులు ఎప్పుడు పట్టుకుంటారోనని ఆందోళన చెందుతున్నారు.

దాడులనేకం 

ఇటీవల తుర్కపల్లి మండలం దత్తాయపల్లిలో పులి బీభత్సం సృష్టించింది, గొట్టె శ్రీశైలం అనే రైతు పశువులను మేపుతుండగా, ఆకస్మా త్తుగా దాడి చేసి లేగ దూడను చంపేసింది. పులిని చూసిన పశువులు, రైతులు భయంతో పరుగులు తీశారు. గంధమల్ల దగ్గర ఇంద్రానగర్ లో రెండు నెలల లేగ దూడను చంపి సగభాగము అవయవాలను తినేసింది. ఈ ఘటన మరికొంత భయాన్ని కల్పించింది.

ఇప్పటివరకు ఇబ్రహీంపూర్, రాళ్ళజంగం, దత్తాయపల్లి లో పశువులపై దాడి చేసి పది పశువులను చంపేసింది. రెండు రోజుల్లో వివిధ ప్రాంతాలవద్ద పులి ప్రజలకు కనిపించి భయ భ్రాంతులకు గురి చేస్తుంది, ఇప్పటివరకు 15 ఆవు దూడలను చంపింది. సిద్దిపేట నుండి యాదాద్రి జిల్లాలోకి : ఆలేరు నియోజకవర్గం మొత్తం మండలాలలో గత 25 రోజుల నుండి సంచరించిన పులి సిద్దిపేట జిల్లా మీదుగా జనగామ జిల్లాలోకి అడుగుపెట్టి. అక్కడి మళ్లీ యాదాద్రి జిల్లాలోకి చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. పులి ఆలేరు మండలం శారాజీపేటలో బుధవారం ఓ లేగదూడపై దాడి చేసింది.

గత నెల 17 నుంచి యాదాద్రి జిల్లా తుర్కపల్లి, యాదగిరిగుట్ట, రాజపేట మండలాల్లో తిరిగింది. అదే ఈ నెల 31న రాత్రి గంధమల్ల ఇందిరానగర్ పరిధిలోని ఓ లేగదూడపై దాడి చేసిన అనంతరం యాదాద్రి, సిద్దిపేట జిల్లాల సరిహద్దులోని దౌలాపూర్ ఫారెస్ట్లోకి చేరింది. మళ్లీ ఈ నెల 2న రాజాపేట మండలంలోకి వచ్చిన పులి బసంతాపురంలో లేగదూడపై దాడి చేసి చంపేసింది. అనంతరం వివిధ గ్రామాల మీదుగా ఆలేరు మండలం శ్రీనివాసపురం, జనగామ జిల్లా సిద్దెంకిలో వ్యవసాయ భూముల పక్కనే ఉన్న గుట్టపైకి చేరిందని, పులి పాద ముద్రల ద్వారా గుర్తించారు.

పులిని ఎలాగైనా పట్టు కునేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు ట్రాప్ కెమెరాలతో పాటు మూడు చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. కానీ వాటికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న పులి జనగామ జిల్లా శామీర్పేటలోని కోమటిరెడ్డి సుశీలమ్మ వృద్ధా శ్రమం వద్ద సంచరించినట్లు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

అక్కడి నుంచి పెంబర్తి మీదుగా మళ్లీ యాదాద్రిజిల్లా ఆలేరు మండలం టంగుటూరు, శారాజీపేట, గొలనుకొండ వరకు కనిపించిన పెద్దపులి పాదముద్రలు ఆ తర్వాత కన్పించలేదు. పులి గొలనుకొండ శివారులోని పెద్దగుట్టపైకి చేరిందా? లేదంటే మరో చోటుకు వెళ్లిందా ? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఇప్పటివర కు మనుషులపై దాడిచేయకున్న, పులి సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

జనగాం జిల్లాలో ప్రత్యక్షం 

కాగా గురువారం రోజున జనగాం జిల్లాలోని రఘునాథపల్లి మండలం మందలగూడెంలో పులి ప్రత్యక్షమైనట్టు స్థానికుల ద్వారా తెలిసింది. ఆ గ్రామానికి చెందిన ఓ రైతు లేగ దూడను చంపినట్లు తెలిసింది. దీంతో అధికారులు చుట్టూ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది.

 పులి కదలికలపై థర్మల్ డ్రోన్లు, ట్రాకర్లతో నిఘా 

జిల్లాలో సంచరిస్తున్న పులి కదలికలను ఎప్ప టికప్పుడు తెలుసుకునేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ట్రాప్ కెమెరాలతోపాటు థర్మల్ డ్రోన్లతో నిఘా పెట్టామని అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారి (పీసీసీఎఫ్ హెచ్‌ఎఎఫ్‌ఎఫ్) డాక్టర్ సి.సువర్ణ పేర్కొన్నారు. పులి అడు గుజాడలు తెలుసుకునేందుకు బుధవారం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 

పులి కదలికలను ఎప్ప టికప్పుడు పర్యవేక్షించేందుకు స్టేట్ లెవల్లో స్పెషల్ టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఎన్టీసీఏ సభ్యురాలు హరిణి వేణుగో పాల్, వైల్ లైఫ్ ఇన్స్టిట్యూట్ తరపున రమేశ్, హైదరాబాద్ కన్సర్వేషన్ సొసైటీ నుంచి ఇమ్రాన్ సిద్దిఖ్, పుణెకు చెందిన ఆర్ ఎస్ క్యూటీమ్మెంబర్స్ ఉన్నారు. ఏది ఏమైనా పులిని త్వరగా బంధించి ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.