calender_icon.png 3 May, 2025 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

03-05-2025 12:00:00 AM

అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి 

కలెక్టర్ వెంకటేష్ దోత్రే 

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 2(విజయ క్రాంతి): నీట్ పరీక్ష నిర్వహణ కొరకు పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగిందని, అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. 

పరీక్ష నిర్వహణ కొరకు జిల్లా కేంద్రంలో ని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రం ఏర్పా టు చేయడం జరిగిందని, 287 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని, ఇందు లో 209 మంది మహిళ అభ్యర్థులు, 78 మంది పురుష అభ్యర్థులు ఉన్నారని తెలిపా రు.

నీట్ పరీక్ష ఈ నెల 4వ తేదీన మధ్యా హ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గం టల వరకు నిర్వహించడం జరుగుతుందని, అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష కేం ద్రంలోనికి అనుమతించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులకు అవ సరమైన పెన్నులను పరీక్షా కేంద్రంలోని అందించడం జరుగుతుందని, పరీక్ష కేంద్రం వద్ద అవసరమైన పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. పరీక్ష పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రా నికి చేరుకోవాలని తెలిపారు.

సెల్‌టవర్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 2(విజయక్రాంతి): భారత్ సంచార్ నిగం లిమిటెడ్ నెట్‌వర్క్ టవర్ల నిర్మాణ ప్రక్రియను  వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో  సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా,  డివిజన్ ఫారెస్ట్ అధికారి సుశాంత్ బొగాడేతో కలిసి తహసీల్దా ర్లు, రేంజ్ అధికారులు, బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులతో టవర్ల ఏర్పాటుపై సమీక్ష సమా వేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మారుమూల ప్రాంతాలకు మొబైల్ నెట్‌వర్క్ సేవలు అందించే విధంగా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్ల నిర్మాణం, నూతన టవర్ల నిర్మాణం కొరకు స్థలాల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని, అవసరమైన చోట అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి స్థలాలను గుర్తించాలని కలెక్టర్ సూచించారు.