03-05-2025 12:16:52 AM
కలెక్టర్ గౌతమ్
మేడ్చల్, మే 2 (విజయ క్రాంతి): ఈనెల 4న జరగనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ కు మేడ్చల్ జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. శుక్రవారం సిఎస్ శాంతి కుమారి తో వీడియో కాన్ఫరెన్స్లో పరీక్షకు జిల్లాలో చేసిన ఏర్పాట్లను వివరించారు.
మేడ్చల్ జిల్లాలో 13 సెంటర్లలో 4336 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి తహసీల్దారులను డ్యూటీ మెజిస్ట్రేట్లుగా నియమించామని, రాచకొండ సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు బందోబస్తు, తనిఖీ, ఎస్కార్ట్ తదితర ఏర్పాట్లు చేశారని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అన్ని పరీక్ష కేంద్రాలలో మెడికల్ కిట్లు, అంబులెన్సులు అందుబాటులో ఉంచనున్నారని తెలిపారు.
నిరంతర విద్యుత్, నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని, అన్ని సెంటర్లకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించామని కలెక్టర్ వివరించారు. జిల్లా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండి అత్యవసర సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటారని తెలిపారు.