calender_icon.png 3 May, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

70 లక్షల మొక్కలు నాటడమే వన మహోత్సవ లక్ష్యం

03-05-2025 12:16:28 AM

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం మే 2 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో225-26 వన మహోత్సవంలో భాగంగా 70 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. శుక్రవారం ఐ డి ఓ సి  కార్యాలయం సమావేశం మందిరంలో అన్ని శాఖల అధికారులతో వనమ హోత్సవం పై ఐటీడీఏ పీవో రాహుల్ , అటవీశాఖాధికారి కృష్ణ గౌడ్ తో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. 

రాష్ట్రం లో పచ్చదనం పెంచాలని లక్ష్యంతో ప్రభు త్వం ఏటా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు.దీనిలో భాగంగా   అన్ని శాఖలకు లక్ష్యాలను నిర్దేశించారు. జిల్లా గ్రా మీణ అభివృద్ధి శాఖకు 30 లక్షల మొక్కలు, టీ జి ఎఫ్ డి సి శాఖకు 12 లక్షల మొక్కలు, అటవీశాఖ 10 లక్షలు, సింగరేణి 10 లక్షలు, ఉద్యానవన శాఖ 5.7 లక్షలు, వ్యవసాయ శాఖ 5 లక్షలు, ఇరిగేషన్ 2 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాలను నిర్దేశించారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు  కలెక్టర్ విద్యా చందన, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, జిల్లా వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కిషోర్, ఇరిగేషన్ ఈ ఈ అర్జునరావు, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ అధికారి ఇందిరా, తదితరులు పాల్గొన్నారు.