calender_icon.png 3 May, 2025 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యంగ్ ఇండియన్ సేవా పురస్కారమందుకున్న కమలాకర్ రక్త దాతలకు ఈ అవార్డు అంకితం..

03-05-2025 12:18:50 AM

కొత్తగూడెం మే 2 ( విజయక్రాంతి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలోని హనుమాన్ జిమ్ అధినేత, కామ కమలాకర్ చేసిన సేవలకు గాను యంగ్ ఇండియన్ పురస్కారం లభించింది.హైదరాబాద్ నాంప ల్లి మదీనా పబ్లిక్ స్కూల్ ఆడిటోరియం లో, గురువారం యంగ్ ఇండియన్ సేవా పురస్కారం 225 అవార్డ్ ల ఫంక్షన్ నేషనల్ వైస్ ప్రసిడెంట్ బాలన్న  ఆధ్వర్యంలో ప్రత్యేక అతిథిగా అశోక్ రెడ్డి  అధ్యక్షతన నిర్వహించా రు. 

ఈ అవారడ్స్ ఫంక్షన్ కి  హనుమాన్  జిమ్ బ్లడ్ ఫౌండర్ గా  సేవల్ని గుర్తించి, యంగ్ ఇండియన్ సేవా పురస్కారం 225 అవార్డు కే అశోక్ రెడ్డి చేతుల మీదు గా అం దుకున్నారు చాలా సంతోషంగా ఉందని, హనుమాన్ జిమ్ బ్లడ్ ఫౌండేషన్ కి అవార్డు దక్కడం దీనికి సహకరించిన నా మిత్రులు అయినటువంటి, బ్లడ్ డోనర్స్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.కమలాకర్ తో పాటు జూ బ్బు, రాజేష్ ల కి ఈ అవారడ్స్ రావడం సంతోషకరం అన్నారు .