30 July, 2026 | 5:49 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

నూతన ఓటర్లకు సకాలంలో గుర్తింపుకార్డులు

17-10-2025 12:00 AM

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా సకాలంలో అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, తహసిల్దార్లతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఈఓ  మాట్లాడుతూ, నూతనంగా ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరికి తపాలా శాఖ ద్వారా ఓటర్ గుర్తింపు కార్డులను చేరవేయాలని సూచించారు. ఓటరు జాబితాలో 100 సంవత్సరాల వయసు కలిగిన ఓటర్లను గుర్తించి వారి వయసును తగిన ఆధారాలతో సమర్పించాలని తెలిపారు.  కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, ఏ ఓ ప్రశాంత్ అధికారులు  పాల్గొన్నారు.