calender_icon.png 18 October, 2025 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కొనుగోళ్లు జరగాలి

17-10-2025 12:00:00 AM

కలెక్టర్ రాహుల్ రాజ్ 

పాపన్నపేట, అక్టోబర్ 16 : నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ధాన్యం కొనుగోళ్లు జరగాలని, దశల వారీగా జరిగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు వెంటనే లబ్ధిదారులకు అందేలా క్షేత్ర స్థాయిలో అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం పాపన్నపేట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఆలస్యం లేకుండా ఎప్పటికప్పుడు కొనుగోళ్లు జరగాలని, ఏ  కేంద్రంలోనూ ఎలాంటి సమస్య రాకూడదని అధికారులను ఆదేశించారు. తేమ శాతాన్ని సరిగ్గా నిర్దారించాలని, కొనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. కొనుగోలు కేంద్రలాలో సమస్యలు ఏమైనా ఎదురైతే తమ దృష్టి కి తీసుకవస్తే, పరిష్కరిస్తామని అక్కడ ఉన్న రైతులకు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట అధికారులు, సిబ్బందిఉన్నారు.