17-10-2025 12:00:51 AM
కలెక్టర్ హైమావతి
సిద్దిపేట కలెక్టరేట్, అక్టోబర్ 16 : జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా సాగేందుకు అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి సూచించారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో గురువారం రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు, సివిల్ సప్లై, డిఆర్డిఓ తదితర విభాగాల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అబ్దుల్ హమీద్,డిసిఎస్‌ఓ తనూజ, డిఎంసిఎస్ ప్రవీణ్, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, డిటిఓ లక్ష్మణ్ పాల్గొన్నారు.