3 July, 2026 | 10:43 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర

21-05-2025 12:16 AM

అతిథులుగా పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ 

యాదాద్రి భువనగిరి మే 20 ( విజయ క్రాంతి): దేశ రక్షణ కోసం అహర్నిశలు కష్టపడిన సైనికులకు, ఇది నిర్వహణలో వీరమరణం పొందిన సైనికుల గౌరవార్థం బిజెపి ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో భారీ ఎత్తున తిరంగా యాత్రను నిర్వహించారు. ఈ యాత్ర హనుమాన్ వాడనుండి ప్రధాన చౌరస్తాల మీదుగా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుంది.

ఈ భారీ యాత్రలో పాల్గొన్న యువకులు ప్రజలు జాతీయ జెండాలు పట్టుకుని భారతమాతకు జై జై జవాన్ జై కిసాన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.  దేశాభిమానం గుండెల నిండా నింపుకొని యువత నినదించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, గూడూరు నారాయణరెడ్డి,బిజెపి జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్, పార్టీ నాయకులు చందా మహేందర్ గుప్తా, మాయ దశరథ, శ్రీనివాస్ కాదురి అచ్చయ్య, డి లక్ష్మీనారాయణ గౌడ్, రాళ్ల బండి కృష్ణ చారి, తంగేళ్లపల్లి గిరిధరాచారి, చందుపట్ల వెంకటేశ్వరరావు, రత్నపురం శ్రీశైలం, కొల్లోజు సతీష్, నర్ల నర్సింగరావు, మల్లికార్జున్, ఉషా కిరణ్, మంగు నరసింహారావు, రావుల సంతు పాల్గొన్నారు.