21-05-2025 12:15:07 AM
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హనుమకొండ, మే 20 (విజయ క్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ గోపాలపూర్ కళా బ్యాంకట్ హాల్ లో 1, 2, 44, 45, 46, 55, 56, 64, 65, 66 వ డివిజనులు, ఐనవోలు, హసన్ పర్తి మండలాల పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశాన్ని నిర్వహించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, టీపీసీసీ అబ్జర్వర్ మాక్సూద్ అహ్మద్, టెస్కాబ్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావులు పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ టీపీసీసీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చేపట్టడం జరిగిందని అన్నారు.
క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నూతన అధ్యక్ష కమిటీల ఎంపిక పై కసరత్తు ముమ్మరంగా జరుగుతోందని, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ తరుణం ఉపయోగకరంగా ఉండబోతుందని తెలిపారు. 2017కు ముందు నుండి పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీ లో కష్టపడ్డ వారికి బ్లాక్ అద్యక్షులు, మండల, డివిజన్, గ్రామ స్థాయి అధ్యక్షులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి రెడ్డి,56 వ డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు, 66వ డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, జిల్లా నాయకులు వీసం సురేందర్ రెడ్డి, గడ్డం శివరాం ప్రసాద్, చింత రమేష్ గౌడ్, దూలం సదానందం గౌడ్, రుద్రోజ్ మణింద్రనాథ్, విజయ్ నాయక్, లావుడియా రవి నాయక్, శనిగరపు అనిత, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.