calender_icon.png 21 May, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోషల్ మీడియా సైనికులే పార్టీకి అసలైన బలగం

21-05-2025 12:17:48 AM

దేవరకొండ ఎమ్మెల్యేబాలు నాయక్

దేవరకొండ, మే 20:  దేవరకొండ పట్టణంలోని సాయి రమ్య ఫంక్షన్ హాల్ లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన దేవరకొండ నియోజక వర్గ సోషల్ మీడియా  యువ సమ్మేళనం విస్తృత స్థాయి సమావేశనికి ముఖ్య అతిథిగా దేవరకొండ శాసన సభ్యులునేనావత్ బాలు నాయక్ హాజరయ్యారు.

అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యూత్ కాంగ్రెస్ సైనికుల పాత్ర అమోఘమని,యువజన కాంగ్రెస్ నాయకులు చేస్తున్న నిరంతర శ్రమ, కృషి వల్లే ప్రజల్లో పార్టీపై నమ్మకం పెరుగుతుంది అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సోషల్ మీడియా వేదికగా నియోజక వర్గ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలి అని అన్నారు.

రైతు రుణమాఫీ, సన్న బియ్యం,200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కు గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,యువత కోసం రాజీవ్ యువ వికాసం,ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్కిల్ యూనివర్సిటీ లాంటి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేయబడుతుంది వీటిని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా,యూత్ కాంగ్రెస్ ,కార్యకర్తలు గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి, ప్రతి కార్యకర్త ఈ విషయాలు ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా నాయకత్వాన్ని బలపరిచే దిశగా ముందుకు సాగాలి అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అనేది ఓ మహాసముద్రం లాంటిది. ఇందులో పనిచేసిన వారందరికీ నిస్సందేహంగా గుర్తింపు, గౌరవం, సరైన పదవులు లభిస్తాయి అని తెలిపారు.రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి సోషల్ మీడియా కార్యకర్త కంకణబద్ధుడై పనిచేయాలని పిలుపునిచ్చారు.యూత్ కాంగ్రెస్ నాయకులకు ఏ బాధ్యత ఇచ్చిన పార్టీకి కట్టుబడి పనిచేస్తే అవకాశం ఉన్నచోట సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది అన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాలనాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.