calender_icon.png 28 September, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు

28-09-2025 01:08:46 AM

-శ్రీవారికి డ్రైఫ్రూట్ల మాలలతో స్నపన తిరుమంజనం

-వాహన సేవల్లో పాల్గొన్న లక్షలాది మంది భక్తులు

తిరుమల, సెప్టెంబర్ 27 : ఆపద మొక్కు ల వాడు, అనాథరక్షకుడు తిరుమల వేంకటేశ్వరస్వామి అంగరంగ వైభవంగా కొనసాగు తున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో కనుల పండువగా జరుగుతున్నాయి. స్వామివారిని ఒక్కోరోజు ఒక్కో రకంగా ఆ లంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. శనివారం శ్రీవారి ఆలయంలో డ్రై ఫ్రూట్లు, రోజామాలల అలంకారంతో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది.

ఆలయంలోని రంగనాయకుల మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అందంగా అలంక రించారు. బాదం, పిస్తా, కుంకుమపువ్వు, వట్టివేరు, పసుపు కొమ్ములు, ఎండు ద్రాక్ష, యాలకులు, తులసి, రోజామాలలతో శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించారు. వివిధ రంగుల పుష్పాలు, ఫలాలు, సాంబ్రా ణి, ధూపదీప నైవేద్యాలతో పూజలు నిర్వహించారు.పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు కొబ్బరినీళ్లు తదితర సుగంధద్రవ్యాలతో అభిషేకం చేశారు.

వేదపండితులు చ తుర్వేదపారాయణం ఆలపించారు. బ్ర హ్మోత్సవాల సమయంలో వాహనసేవల్లో తిరు వీధుల్లో ఊరేగి అలసిపోయే స్వామివా రు స్నపనతిరుమంజనంతో సేద తీరుతారని ఆలయ అర్చకులు తెలిపారు. ఉత్సవాల నా లుగో రోజు శనివారం రాత్రి శ్రీవారికి సర్వభూపాల వాహన సేవను ఎంతో కనులపం డువుగా నిర్వహించారు.శ్రీవారి వాహన సేవలను వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం శ్రీమలయప్ప స్వామి ఉభయదేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.

వాహనం ముం దు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తూ మం గళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. వాహనసేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, తిరుమల చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్కుమార్ సింఘాల్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బోర్డు సభ్యులు, సీవీ ఎస్వో మురళికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.