28-09-2025 01:06:54 AM
-ఝార్సుగూడలో 60 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
-డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రెట్టింపు వేగంతో అభివృద్ధి
-ప్రధాని నరేంద్ర మోదీ
ఝార్సుగూడ, సెప్టెంబర్ 27: ఒడిశా రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. శనివారం ఒడిశా ఝార్సుగూడలో రూ. 60వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ టవర్లు, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, రైల్వే ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులు, విద్య, నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులతో పాటు మరిన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ మొబైల్ టవర్లను జాతికి అంకితం చేశా రు.
దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ దాదాపు 97, 500 4జీ టవర్లు నిర్మించింది. ‘డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఒడిశా రెట్టింపు వేగంతో అభివృద్ధి చెందుతుంది. చిప్ నుంచి షిప్ వర కు దేశం ప్రతి రంగంలోనూ స్వయం సమృద్ధి సాధించాలనేదే మా సంకల్పం. దశాబ్దాలుగా ఒడిశా కష్టాలు ఎదుర్కొన్నా.. ఈ దశాబ్దం రాష్ట్రాన్ని సంపన్న భవిష్యత్ వైపు నడిపిస్తుంది’ అని పేర్కొన్నారు. బెర్హంపూర్‌ఉధ్నా (సూరత్) మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.