14 April, 2026 | 8:08 PM

ప్రపంచ అథ్లెటిక్స్ లెవల్ 2.కోచ్‌గా తిరుమలరావు

28-02-2026 12:25 AM

జవహర్‌నగర్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ప్రపంచ అథ్లెటిక్స్ లెవెల్ 2 కోచ్ గా తిరుమలరావు ఎంపికయ్యాడు. తాజాగా వెలువడిన ఫలితాల్లో ప్రపంచ అథెటిక్స్ లెవెల్ టు అండర్ 18 స్పెషల్ కోచ్ గా అర్హత సాధించాడని శుక్రవారం ఒక ప్రకటనలో తిరుమలరావు తెలిపారు. లాంగ్ జంప్, త్రిపుల్ జంప్, హై జంప్, పోటీల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో కోచ్ గా శిక్షణ ఇవ్వచ్చునని పేర్కొన్నారు.

పేద పిల్లలకు ప్రత్యేకంగా శిక్షణనిస్తూ జాతీయ స్థాయి లో పోటీల్లో పాల్గొనేలా సంసిద్ధం చే స్తున్నానని తెలిపారు. గతంలో జ వహర్‌నగర్‌లోని పలు స్కూళ్లలో విద్యార్థులకు అథ్లెటిక్స్ కోచ్‌గా ప్రత్యేక శిక్షణను ఇచ్చానన్నారు. అథ్లెటిక్స్‌లో పథకాలు సాధించి తెలంగాణకు, భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు తేవడమే తమ లక్ష్యమని తెలిపారు.