రాజ్యాధికారం కోసం మాదిగలు కృషి చేయాలి
మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు
ముషీరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ జాతి హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలకు మాదిగలపై న నమ్మకం లేదని, రాజకీయాలు చేయడం మాదిగలకు చేతకాదని అందుకే వెనుకబడి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్‌లో మాదిగ హక్కుల దండోరా ఆవిర్భావ దినోత్సవ సభ జరిగింది. ముఖ్య అతిధిగా మోత్కు పల్లి పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు ద్వారా రాజ్యాధికారాన్ని సాధించాలని, ఓట్లను డబ్బులకు అమ్ముకోరాదని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సమితి ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రోజారాణి, ప్రముఖ కవి చిలుక భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.




