calender_icon.png 12 September, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

05-11-2024 09:34:30 AM

హైదరాబాద్: తిరుమలలో టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. వెంకన్న సర్వదర్శనానికి 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 74,651 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,712 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.14 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. మంగళవారం నాగుల చవితి సందర్భంగా పెద్దశేష వాహన సేవ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనం పై మాడవీధులలో మలయప్పస్వామి ఉరేగునున్నారు.