calender_icon.png 12 September, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోండ్రియాల సొసైటీ ఛైర్మన్‌గా బుర్రా నరసింహారెడ్డి ఎన్నిక

12-09-2025 08:31:09 PM

అనంతగిరి: మండల పరిధిలోని గొండ్రియాల గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్ గా మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన బుర్ర నరసింహా రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.ఆయన చేత సీఈవో రమేష్ సంతకాలు తీసుకున్నారు.గొండ్రియాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ చైర్మన్ను తొలగిస్తూ నూతన చైర్మన్ గా బుర్ర నరసింహా రెడ్డినీ నియమిస్తూ జిల్లా సొసైటీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్ గా ఎంపికైన బుర్ర నరసింహ రెడ్డి కి కష్టపడి పనిచేసిన వ్యక్తిగా మండలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.కాంగ్రెస్ పార్టీలో  పనిచేస్తూ తనదైన శైలిలో చురుకైన పాత్ర వహించారు.

ప్రజలు బుర్ర నరసింహ రెడ్డి పట్ల ఎంతో ప్రేమాభిమానాలు కురిపించారు.సొసైటీలో రెండు మార్లు చైర్మన్గా వ్యవహరిస్తూ 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో సొసైటీ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన వ్యక్తిని చైర్మన్గా తీసుకోవడం పట్ల డైరెక్టర్లతోపాటు పలువురు రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నూతన చైర్మన్ బుర్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ గొండ్రియాల సొసైటీ చైర్మన్ గా మూడోసారి అవకాశాన్ని కల్పించిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి,ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా అధికారులు నాపై ఉంచిన నమ్మకాన్ని సద్వినియోగం చేసుకుంటూ సొసైటీ అభ్యున్నతకు కృషి చేస్తానని ఆన్నారు.రైతుల పట్ల సత్ప్రవర్తనతో సొసైటీని ముందుకు తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.