calender_icon.png 12 September, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌడ సంఘం యూత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బండి వంశీకృష్ణ గౌడ్

12-09-2025 08:39:22 PM

రేగొండ,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన బండి వంశీకృష్ణ గౌడ్ ని సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే వీరస్వామి గౌడ్ శుక్రవారం నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా బండి వంశీకృష్ణ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడికి, రాష్ట్ర గౌడ సంఘం నాయకులకు ధన్యవాదాలు తెలిపారు .గీత కార్మికుల హక్కుల సాధనకై, గీత వృత్తి పరిరక్షణకై అనునిత్యం వారికి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కార దిశగా శ్రమిస్తానని తెలిపారు.తన నియమాకానికి సహకరించిన రాష్ట్ర గౌడ యువజన నాయకులు గణపతి గౌడ్, సోమన్న గౌడ్ కి, నాగరాజు గౌడ్ కి, రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.