12-09-2025 08:36:01 PM
మానకొండూరు,(విజయక్రాంతి): చైనా దేశం నుంచి యూరియా దిగుమతులు లేకపోవడం కారణంగా యూరియా కొరత ఏర్పడిందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం బెజ్జంకి మండల పరిషత్ సమావేశ మందిరంలో మండలానికి చెందిన 38 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.11,70,500 విలువ గల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ... యూరియా కొరత తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సమస్యతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
యూరియా సమస్య విషయంలో రైతులు అపొహలకు గురికావద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి ఎంపీడీవో ప్రవీణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కరవేణి పోచయ్య ముదిరాజ్, పార్టీ నాయకులు చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, బైర సంతోష్, ఆర్ మల్లికార్జున్, రావుల నర్సయ్య, గూడెల్లి శ్రీకాంత్, మహేందర్, కుమార్, చెట్టి రాజు, బి.రాజు, సంపత్ రెడ్డి శరత్, పి.సంతోష్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
పరామర్శలు..
బెజ్జంకి, గన్నేరువరం మండలాల్లో ఇటీవల వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబాలను మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శించారు. బెజ్జంకి మండలం గుండారంలో చెందిన ఎలకంటి మల్లారెడ్డి, గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంల బద్దం తిరుపతి రెడ్డి , గన్నేరువరం లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొడ్డు సునీల్ తండ్రి బొడ్డు చంద్రమోహన్, బుర్ర పద్మ మరణించగా వారి కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.