2 July, 2026 | 4:42 PM

Breaking News

చెట్టే శాపమైందా..? ఇందిరమ్మ మోడల్ హౌస్‌కు పగుళ్లు   •   బహిరంగ చర్చకు వెనక్కి తగ్గింది కాంగ్రెస్ ప్రభుత్వమే: సిలివేరి సత్యనారాయణ   •   ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •  

క్లస్టర్ ఏఈవోగా చొప్పదండి తిరుపతి..

03-06-2025 05:12 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి క్లస్టర్ ఏఈఓగా చొప్పదండి తిరుపతి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన ఒప్పంద ఏఈవో కుమారి అంజలి విధుల కాలపరిమితి ముగిసింది. ఆమె స్థానంలో చొప్పదండి తిరుపతి ఇన్ సర్వీస్ కోటాలో పొలాస వ్యవసాయ కళాశాలలో 4 సంవత్సరాలు B. Sc వ్యవసాయవిద్యను పూర్తి చేసుకొని విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు ఎల్లవేళలా  అందుబాటులో ఉండి సాగులో మెలుకువలు నేర్పుతూ రైతులకు తన వంతు సేవలు అందిస్తానని తిరుపతి తెలిపారు.