13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

సింగూర్ నుంచి ఘనపూర్‌కు 0.3 టీఎంసీ నీరు విడుదల చేయాలి

31-03-2026 12:29 AM

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి

మెదక్, మార్చి 30(విజయ క్రాంతి) :సిం గూర్ ప్రాజెక్ట్ నుండి ఘనపూర్ రాయకట్టకు 0.3 టీఎంసీ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మ దేవేం దర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సో మవారం పాపన్నపేట మండలం చిత్రియా ల గ్రామ శివారులో పంటపొలాలను పార్టీ మండల నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి సంవత్సరం రైతుల అ వసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేసి రెండు పంటలు పండించే అవకాశం కల్పించారని తెలిపారు. ఘనపూర్ ఆయకట్ట పరిధిలో ఎఫ్‌ఎం, ఎఫ్‌ఎన్ కాలువల ద్వారా మూడు మండలాలకు సాగునీరు అందు తూ రైతులు పుష్కలంగా పంటలు పండించుకునేవారని చెప్పారు.

పండించిన పంట లను ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నదని గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నీటి సమస్యల ను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ఈ సీజన్లో సింగూర్ నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదన్నారు.

రైతు లకు క్రాప్ హాలిడే ప్రకటించకపోవడం, నష్టపరిహారం ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. నర్సాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. పంటలు పొట్టదశలో ఉన్నందున వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాం డ్ చేశారు. లేదంటే బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామ ని హెచ్చరించారు.

వీరి వెంట చిట్రియల్ సర్పంచ్ సురేష్, పాపన్నపేట్ మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్ బాల గౌడ్, మాజీ రైతుబంధు అధ్యక్షులు సోములు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు కొత్తపల్లి జగన్, మాజీ సర్పంచులు గురుమూర్తి గౌడ్, బద్రి.మల్లేశం శ్రీనాథ్ రావు, నాయకులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.