16-07-2025 12:36:36 AM
- జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలి
- హాజరైన కలెక్టర్ సిపి సాయి చైతన్య టీఎన్జీవోలు
- హాజరైన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
- హాజరైన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య
నిజామాబాద్ జులై 15: (విజయ క్రాంతి) ప్రతి యేడు ఆషాడమాసం లో నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ లో వెలసిన శ్రీశ్రీశ్రీ నవదుర్గ ఆలయంలో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ నిర్వహించా రు.టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్ ఇతర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య లు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ పండుగకు వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి బోనాల పండుగ నిదర్శనమని ఆయన అన్నారు అమ్మవారికి పెట్టే నైవేద్యం ఎంతో పవిత్రతతో కలిగినదని అమ్మవారి ప్రజలందరినీ ఆశీర్వదించాలని అమ్మవారికి పూజలు సమర్పించిన సాయి చైతన్య కోరారు. జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తదితరులు మాట్లాడుతూ జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని వివిధ అంటూ వ్యాధుల్లో నుండి అమ్మవారు రక్షించాలని పాడి పంటలు పండాలని పంటలకు సరిపడే వానలు కురియాల అని అమ్మవారికి మొ క్కులు సమర్పించిఆనందోత్సవాల మధ్య బోనాల ఉత్సవాన్ని నిర్వహించారన్నారు.
టీఎన్జీవోస్ ఉద్యోగుల సంఘం ప్రతి సంవత్సరం నవదుర్గ మాత ఆలయంలో బోనాల పండగ నిర్వహించడం ఎంతో శుభ సూచకమని అమ్మవారి దయ వివిధ శాఖలు పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, వారి కు టుంబ సభ్యులు, అవరోధాలు లేకుండా ఎలాంటి మహమ్మారిలు రాకుండా కోరారు. అలాగే ఇంత పెద్ద ఎత్తున టీఎన్జీవో అధ్యక్షుడు సుమన్ కులమతాలకు తేడా లేకుండా అమ్మవారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు మహా అన్న ప్రసాదం వితరణ కార్యక్రమం చేయడం గొప్ప విషయమని టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి తెలంగాణ ప్రతిబింబమైన బోనాల ఉత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు.