17-07-2025 01:16:10 AM
సంగారెడ్డి, జూలై 16(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా టీఎన్జీవో సంఘం అధ్యక్షులు జావిద్ అలీ, సంఘ నాయకులు ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామిని బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో వారు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన పాత్ర, ప్రభుత్వ విధానాల అమలులో ఉద్యోగుల పాత్ర గురించి తెలిపారు ముఖ్యంగా, ఉద్యోగుల సంక్షేమం, పదోన్నతులు, స్థానిక సమస్యలు, ఖాళీ పోస్టుల భర్తీ వంటి అంశాలను మంత్రికి వివరించారు.
టీఎన్జీవో సంఘం ప్రతినిధులతో ఉద్యోగుల అభ్యున్నతికి మద్దతుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. అలాగే ప్రభుత్వ పాలనను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు ఉద్యోగుల సహకారం నిరంతరంగా ఉంటుందని మంత్రి హామీనిచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కార్యదర్శి వేల్పూర్ రవి, అసోసియేట్ అధ్యక్షులు శ్రీకాంత్, కోశాధికారి శ్రీనివాస్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశం, యాదవ్ రెడ్డి, షకీల్, విజయ్, సాయి, వేణుమాధవ్, రమేష్ అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.