17-07-2025 01:16:44 AM
-మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
-దమ్మపేటలో ఇందిరా మహిళా శక్తి సంబురాలు
దమ్మపేట, జూలై 16: కాంగ్రెస్ ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు సామాజిక ఆర్థిక స్థితిగతులు బలోపేతం చేయడానికి దోహదపడుతుందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గిరిజన బాలుర జూనియర్ కళాశాలలో ఇందిరా మహి ళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొ ని నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన మహిళలకు రు 2.50 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాలను చెక్కులను అందజేశారు. కార్యక్ర మంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు.