ఘనంగా టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలు
ముకరంపుర, ఆగస్టు 6 (విజయ క్రాంతి): టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు, ఎంప్లాయిస్ జే ఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలు గురువారం టీఎన్జీవోల కమ్యూనిటీ హా ల్లో ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా కేక్ కట్ చేయడంతో పాటు ఉద్యోగుల స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం గరల్స్ కళాశాల సమీపంలోని అనాథ చిన్నారులకు నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.
అలాగే తెలంగాణ సిద్ధాంతకర్త ఆచా ర్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల జిల్లా ప్రధాన కార్యదర్శి సంగేం లక్ష్మణరావు, నాయకులు మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, ఎడ్ల అరవింద్ రెడ్డి, ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, ఒంటెల రవీందర్ రెడ్డి, రాగి శ్రీనివాస్, గంగారపు రమేష్, హర్మీందర్ సింగ్ ప్రభాకర్ రెడ్డి మారుపాక రాజేష్ భరద్వాజ్, శ్రీమాన్ రెడ్డి, పోలు కిషన్, నాగరాజు, శారద, సునీత, సరి త, సుస్మిత, శైలజ, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






