22-06-2025 12:00:00 AM
పాలు పోషకాహారం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇది బలవర్ధకమైన ఆహారం. అందుకే డాక్టర్లు కూడా రోజూ పాలు తాగాలని చెప్తుంటారు. అందుకు కారణాలేంటి? పాలలోని ప్రత్యేకత ఏంటి? హెల్దీగా ఉండటానికి పాలు ఏవిధంగా తోడ్పడతాయో తెలుసుకుందాం..
పాలు మన నిత్యజీవితంలో ఒక భాగం. నేరుగా కాకపోయినా టీ, కాఫీ వంటి రూపాల్లో తీసుకుంటాం. అలాగే పాల ఉత్పత్తులు కూడా మన డైలీ లైఫ్లోవిరివిగా వాడుతుంటాం. ఎందుకంటే పాలు పోషకాహారం కాబట్టి. పాలలో మన శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్, క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, రైబో ఫ్లావిన్, నియాసిన్ ఉంటాయి. వాటితోపాటు విటమిన్ ఎ, డి, బి12, మైక్రో మినరల్స్ కూడా ఉంటాయి. శరీరంలోని కొన్ని రకాల హార్మోన్ల ఉత్పత్తికి అవసరమయ్యే కొవ్వు పదార్థాలు పాల ద్వారానే లభిస్తాయి. పాలు మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. పాలు తాగితే కంటిచూపు మెరగవుతుంది.
ఎక్సర్సైజ్, వర్కవుట్స్ వంటివి చేసిన తర్వాత పాలు తాగితే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. నిద్రలేమితో బాధపడేవాళ్లు పడుకు నే ముందు ఒక గ్లాసు పాలలో కాస్త తేనె కలుపుకుని తాగితే మంచిది. పాలలో పసు పు, మిరియాలు, శొంఠి వంటివి కలుపుకుని తాగడం వల్ల వైరస్, బ్యాక్టీరియా వంటివి నశిస్తాయి. దాహం ఎక్కువగా ఉన్నప్పుడు నీటి కంటే పాలు తాగితే దప్పిక తీరుతుంది. పాలు1.5 రెట్లు ఎక్కువగా దాహం తీర్చగలవు. పాలలో 85 శాతం నీరే ఉంటుం ది. పాలు నేరుగా తాగడం ఇష్టం లేని వాళ్లు అందులో కార్న్‌ఫ్లేక్స్, నట్స్, ఓట్స్ వేసుకుని తీసుకోవచ్చు. కొందరికి పాలు జీర్ణం కావు. అలాంటివాళ్లు సోయా పాలు, బాదం పాలు, కొబ్బరి పాలు వంటివి తీసుకోవాలి.