calender_icon.png 6 May, 2025 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేరు ప్రతిష్టలు తేవాలి

06-05-2025 12:00:00 AM

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

రాష్ట్ర మొదటి ర్యాంకు విద్యార్థిని కృతిని సన్మానించిన ఎమ్మెల్యే 

నిజామాబాద్, మే 5 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించిన కాకతీయ ఒలంపాడు విద్యార్థిని ఎస్కృతి మీ మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల్లో స్టేట్ ర్యాంకు సాధించడం చాలా గొప్ప విషయమని ఉన్నత చదువులు చదివి నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రానికి మంచి పేరు తేవాలని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ఉన్నత చదువులకై ఎంచుకున్న లక్ష్యంతో ఉత్తీర్ణత సాధించి జిల్లాకు తల్లిదండ్రులకు చదివిన విద్యాసంస్థలకు మంచి పేరు తేవాలని సుదర్శన్ రెడ్డి విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ బిల్లా రామ్మోహన్ డైరెక్టర్ సిహెచ్ రజనీకాంత్ కాకతీయ విద్యాసంస్థల ప్రిన్సిపల్ ఎండి ఫరీదుద్దీన్ విద్యార్థిని కృతి తల్లిదండ్రులు కృష్ణ తదితరులు హాజరయ్యారు.