calender_icon.png 6 May, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షానికి దెబ్బతిన్న పంటల పరిశీలన

06-05-2025 12:00:00 AM

కొండపాక, మే 05: కొండపాక మండలంలో ఆదివారం సాయంత్రం అకాల వర్షానికి నష్టపోయిన పంట పొలాలను మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారి శివరామకృష్ణ తో కలిసి సోమవారం పలు గ్రామాల్లో పరిశీలించారు. మండలంలోని మర్పడగ, సిరసనగండ్ల, ఖమ్మంపల్లి, దమ్మకపల్లి, కొండపాక తదితర గ్రామాల్లో వడగండ్ల వాన, ఈదురు గాలుల బీభత్సానికి పంటలన్నీ నష్టపోయాయి.

మామిడి కాయలు రాలిపోయి మామిడి తోటలకు తీవ్ర నష్టాన్ని గురిచేసింది. విషయం తెలుసుకున్న అధికారులు నాయకులు పలు గ్రామాల్లో పరిశీలించి రైతులను పరామర్శించారు. నష్టం వివరాలను సేకరించారు. పంటల నష్టాన్ని ప్రభుత్వానికి అందించి పరిహారం అందేలా కృషి చేస్తానని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వాసరి లింగారావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరశురాములు, నాయకులు మంచాల కనకరాములు నీల మల్లేశం కొయ్యడ వెంకటేశం యాదయ్య సిద్ధులు రామారావు తదితరులున్నారు.