calender_icon.png 10 July, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాంపత్య జీవితానికి!

25-05-2025 12:00:00 AM

‘దంపతుల మధ్య దాపరికాలుండద్దు’ అంటారు పెద్దలు. కానీ పెళ్లయిన కొత్తలో కొంతమంది దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల అన్ని విషయాలు పంచుకోలేకపోవచ్చు. ఇద్దరిలో ఎవరికైనా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎదుటి వారికి చెప్పడానికి కాస్త తడబడుతుంటారు. ఇందుకు ముఖ్యంగా ‘ఈ విషయం చెబితే వారు ఏమనుకుంటారో ఏమో? ఇది కూడా ఎలా పరిష్కరించుకోవాలో తెలియదా..

అని అనుకుంటారేమో’ అనే మొహమాటాలు కారణమవుతాయి. అలాగని వారితో పంచుకోకపోతే ఆ దూరం అలాగే ఉండిపోతుంది. కాబట్టి పెళ్లునప్పటి నుంచే దంపతులు ఎలాంటి విషయాలనైనా ఒకరికొకరు చెప్పుకోవడం, అందులోని క్లిష్ట సందర్భాన్ని కలిసి ఎదుర్కోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా ముందు నుంచి చేయడం వల్ల రాను రాను భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలూ లేకుండా వారి మధ్య అనుబంధం మరింత దృఢమవుతుంది.

ఇది ఎన్నేళ్లయినా తరగకుండా అలాగే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భార్యాభర్తల బంధం అంటే భారం కాదు.. బాధ్యత. అయితే పెళ్లున కొత్తలో ఒకరిపై మరొకరికి అవగాహన లేకపోవడం వల్ల చిన్న చిన్న అలకలు, గొడవలు సహజం. దాంపత్య జీవితం కలకాలం సుఖంగా సాగాలంటే.. అందుకు ఒకరి ఇష్టాల్ని మరొకరు గౌరవించడం, ఎదుటి వారికి నచ్చినట్టుగా మెలగడం.. వంటివి కూడా ముఖ్యమే.