calender_icon.png 11 July, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసలైన ఆస్తులు ఇవే!

25-05-2025 12:00:00 AM

మేం పేదలం అని చాలామంది ఫీల్ అవుతుంటారు. అయితే డబ్బుతో కొనలేని కొన్ని నిజమైన ఆస్తులు మన చుట్టూ చాలా ఉన్నాయి. ఉరుకులు పరుగుల జీవితంలో కాసేపు ప్రశాంతంగా కూర్చొని మనసును తేలిక చేసుకోవడం ఒక అద్భుతమైన ఆస్తి.

అంతరంగ స్నేహితులు

కష్టసుఖాలలో తోడుండే నిజమైన స్నేహితులు మనకు ఎప్పుడూ అండగా నిలుస్తారు. అలాంటివారు అందరికీ ఉండరు. 

ప్రకృతి ఒడిలో.. 

వారాంతాల్లో ప్రకృతి ఒడిలోకి చేరడం మనసుకు ఎంతో హాయినిస్తుంది. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి.

కుటుంబానికి సమయం

కుటుంబంతో కలిసి గడిపే ప్రతి క్షణం అద్భుతమే. ఒకరికొకరు తోడుగా ఉండటం, ప్రేమను పంచుకోవడం జీవితానికి నిజమైన అర్థాన్నిస్తుంది.

అమితమైన ప్రేమ

ఒక వ్యక్తి నుంచి నిజమైన ప్రేమను పొండటం వరం కన్నా ఎక్కువ. వారు ఆనందాన్ని పంచడమే కాకుండా.. కష్టాల్లోనూ తోడుంటారు. 

కంటినిండా నిద్ర

హాయిగా నిద్రపోతేనే చేయాలనుకున్నవి సక్రమంగా చేయగలం. ఉత్సాహంగా ఉండగలం.