28 August, 2026 | 2:17 PM

నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

09-12-2024 01:50 AM

* సాయంత్రం 6.05 గంటలకు ఆవిష్కరించున్న సీఎం  

* భారీ బహిరంగ సభకు లక్ష మంది మహిళలు 

* హాజరు కానున్న గవర్నర్

* మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుపై సర్వత్రా ఆసక్తి

హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి):  ఏడాది ప్రజాపాలన విజయోత్స వాల్లో భాగంగా సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సోమవారం సాయం త్రం 6.05 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లు, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. విగ్రహావిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. సచివాలయ ఆవరణలో జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు లక్ష మంది మహిళలు పాల్గొననున్నారు.

ఈ సభను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై ప్రసంగించనున్నారు. దాదాపు 150 మంది ప్రముఖులు ఆశీనులయ్యేలా ప్రధాన వేదికతోపాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మరో వేదికను ఏర్పాటు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరుకావా లని మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్‌తోపాటు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను రాష్ట్ర ప్రభు త్వం ఆహ్వానించింది. ఎర్రవె ల్లి ఫౌమ్‌హౌస్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లి కేసీఆర్ ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయి తే కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది. తెలంగాణా తల్లి విగ్రహావిష్కరణకు  స్వయం సహాయ బృందాల మహిళలు, ఇతరులందరూ మధ్యాహ్నం నాలుగున్నరలోగా చేరుకునేలా చర్యలు చేపట్టారు. నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, గోశాల రోడ్, నిజాం కాలేజ్, పబ్లిక్ గార్డెన్‌లో పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.