3 July, 2026 | 9:49 PM

Breaking News

చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •  

నేడే సూపర్‌మూన్ బ్లూమూన్

19-08-2024 01:09 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 18: సోమవారం రాత్రి ఆకాశంలో అద్భుతం గోచరించనున్నది. సూపర్‌మూన్ బ్లూమూన్ కలిసి ఒకేసారి కనువిందు చేయనున్నాయి. ఎన్నో దశాబ్దాలకు ఒకసారిగానీ ఇలాంటి అద్భుతం ఏర్పడదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమికి చంద్రుడు అతి సమీపానికి వచ్చినప్పుడు సాధారణంకంటే చాలా పెద్దగా కనిపిస్తాడు. దీనినే సూపర్ మూన్ అంటారు. ఇక బ్లూ మూన్ అంటే చంద్రుడు నీలిరంగులో ఏమీ కనిపించడు. ఒక సీజన్‌లో నాలుగు ఫుల్‌మూన్‌లు ఏర్పడుతాయి. అందులో మూడో దాన్ని బ్లూమూన్ అని పిలుస్తారు. ఈ బ్లూ మూన్‌ను మొదట 1528లో రికార్డు చేయ టం గమనార్హం. 

ఎలా చూడాలి?

ఈసారి సూపర్‌మూన్ సోమవారం రా త్రి మొదలై మూడు రోజులపాటు కనువిం దు చేయనున్నది. సోమవారం రాత్రి 11.56 గంటలకు ఇది ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ సూపర్‌మూన్‌ను చూసి ఆనందించాలంటే మేఘాలు, వాతావరణ కాలుష్యం లేని ప్రాంతాన్ని ఎంచు కోవాలని సూచించారు. ప్రకాశవంతమైన విద్యుత్తు వెలుగులు లేని చోట అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. దీనిని సాధారణ కంటితోనే చూడవచ్చు. కానీ టెలిస్కోప్, బైనాక్యులర్స్‌తో చూస్తే చంద్రుడిపైన ఉన్న బిలాలు, లోయలు కూడా కనిపిస్తాయి. ఈ ఏడాది మరో మూడు సూపర్‌మూన్‌లు ఏర్పడనున్నాయి. సెప్టెంబర్ 17న హార్వెస్ట్ మూన్, అక్టోబర్ 17న హంటర్స్ మూన్, నవంబర్ 15న చివరి సూపర్‌మూన్ ఏర్పడుతాయి. ఇందులో అక్టోబర్ 17న ఏర్పడేది మరింత పెద్దగా, ప్రకాశవంతంగా ఉంటుంది.